బాలీవుడ్ లో దీక్షా సేధ్

బాలీవుడ్ లో దీక్షా సేధ్

Published on Jun 3, 2013 7:10 PM IST

Deeksha_seth (2)
‘రెబెల్ ‘,’నిప్పు’ చిత్రాల్లో దీక్షా సేధ్ కనిపించిన రాబోతున్న ఓ హిందీ చిత్రంలో అవకాశం సంపాదించింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం కరీనా కపూర్ కజిన్, అర్మాన్ జైన్ సరసన ముఖ్య పాత్ర పోషించనుంది . సైఫ్ అలీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్తియాజ్ అలీ తమ్ముడు ఆరిఫ్ అలీ దర్శకత్వం వహించనున్నాడు . కొన్ని నెలల క్రితం సి.ఏ.ఏ -క్వాన్ అనే ముంబైలోని ఓ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ తో ఒప్పందం కుదుర్చుకున్నాక వచ్చిన మొదటి హిందీ అవకాశం ఇది. ప్రస్తుతం దీక్ష కు తెలుగు లో అవకాశాలు ఏమి లేవు. తన తమిళ చిత్రం ‘వెట్టై మన్నన్’ ఇంకా నిర్మాణం జరుపుకుంటుంది. కనీసం బాలీవుడ్లోనైనా ఆమెకు అదృష్టం సహకరిస్తుందేమో వేచి చూడాలి

తాజా వార్తలు