మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కి అలాగే వారి ఫ్యాన్స్ కి అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర థియేటర్స్ లో ఒకోదానికి మంచి అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా క్రాస్ రోడ్స్ లో సంధ్య 70ఎంఎం థియేటర్ అంటే స్పెషల్ అనుబంధం ఉంది. మరి ఈ థియేటర్ దగ్గర పవన్ నటిస్తున్న అవైటెడ్ చిత్రం ఓజి సినిమా మేనియా చూడాలి అనుకుంటున్నట్టు థమన్ అంటున్నాడు.
యంగ్ దర్శకుడు సుజీత్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమాపై ఉన్న హైప్ వేరే లెవెల్. అందుకు తగ్గట్టుగానే థమన్ కూడా నెక్స్ట్ లెవెల్ డ్యూటీ ఈ సినిమా కోసం చేస్తున్నాడు. దీనితో ఓజి చిత్రం తాను కూడా ఎంతో ఎదురు చూస్తున్నాను అని మెయిన్ గా సంధ్య 70ఎంఎం దగ్గర మీ అందరి హంగామా చూసేందుకు ఎంతో ఎదురు చూస్తున్నాను అంటూ పవన్ ఫ్యాన్స్ పై ఒక స్కెచ్ డిజైన్ తో పోస్ట్ చేసాడు. దీనితో ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Can’t wait to see you all Here !!
⚔️ #OG ???????? pic.twitter.com/WYSEWJ77VH
— thaman S (@MusicThaman) April 16, 2025