కళ్యాణ్ అన్న కెరీర్‌లో ఈ మూవీ స్పెషల్‌గా నిలిచిపోతుంది – ఎన్టీఆర్

కళ్యాణ్ అన్న కెరీర్‌లో ఈ మూవీ స్పెషల్‌గా నిలిచిపోతుంది – ఎన్టీఆర్

Published on Apr 13, 2025 7:00 AM IST

నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం అర్జున్ S/O వైజయంతి ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామా చిత్రంగా రూపొందించారు. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌కు మంచి విజయం దక్కాలని ఆకాంక్షించారు. ఇక తాను ఈ సినిమాను ఇప్పటికే చూశానని.. ఇందులో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, వారికి చాలా రోజుల పాటు ఈ సినిమా గుర్తుండిపోతుందని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని.. అందులో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడని తారక్ తెలిపారు. ఈ సినిమా కళ్యాణ్ అన్న కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోతుందని ఎన్టీఆర్ అన్నారు.

ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు