మరోసారి ట్రీట్ తో ‘దేవర’.. కానీ

మరోసారి ట్రీట్ తో ‘దేవర’.. కానీ

Published on Apr 12, 2025 11:01 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. తారక్ నుంచి సోలోగా వచ్చిన ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ వసూళ్లు అందుకొని తన కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక రీసెంట్ గానే ఈ చిత్రం జపాన్ లో కూడా విడుదల అయ్యింది.

ఇలా రిలీజ్ నాటి నుంచి ఇపుడు వరకు ఏదొక అంశంలో వినిపిస్తూ వస్తున్న దేవర ఇపుడు అభిమానులకి మరో ట్రీట్ ఇస్తుంది. సెన్సేషనల్ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకి ఇచ్చిన పాటలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. మరి ఇపుడు ఈ సినిమా అవైటెడ్ ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) ని మేకర్స్ రిలీజ్ చేసేశారు.

దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనంద పడ్డారు కానీ ఇంతలోనే థియేటర్స్ లో ఉన్న మరికొన్ని హిట్ ట్రాక్స్ లో ఇందులో మిస్ అయ్యాయి అని డిజప్పాయింట్ అవుతున్నారు. మొత్తం 16 ట్రాక్స్ ని మాత్రమే రిలీజ్ చేయగా వీటిలో తాము అనుకున్నవి కొన్ని లేవు అంటూ డిజప్పాయింట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు