ఎట్టకేలకు వెలుగులోకి రానున్న దళం

ఎట్టకేలకు వెలుగులోకి రానున్న దళం

Published on Jun 2, 2013 9:10 PM IST

Dalam
నవీన్ చంద్ర, పియా బాజ్పాయ్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ‘దళం’ సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళీ వెలుగులోకి రానుంది. చాలా కాలం క్రితమే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో కూడా గత డిసెంబర్లో విడుదలైంది. కానీ ఈ చిత్ర నిర్మాతలు సరైన విడుదల సమయం లేదని పక్కన పెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాత సుమంత్ కుమార్ రెడ్డి సినిమాని జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో అధికారికంగా తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

రామ్ గోపాల్ వర్మ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన జీవన్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్. జేమ్స్ వసంతన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సుధాకర్ యక్కంటి సినిమాటోగ్రాఫర్. అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకుదాం అనుకునే కొంత మంది నక్సలైట్లు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

తాజా వార్తలు