సుమ అడ్డాలో అనుదీప్ నాన్-స్టాప్ పంచులు

సుమ అడ్డాలో అనుదీప్ నాన్-స్టాప్ పంచులు

Published on Mar 8, 2025 10:00 PM IST

‘జాతిరత్నాలు’ చిత్రంతో సరికొత్త కామెడీ ట్రెండ్‌ను స్టార్ట్ చేశాడు దర్శకుడు అనుదీప్ కెవి. ఈ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాల్లో కామెడీ ఎలాంటి నవ్వులను పూయిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే, సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ డైరెక్టర్ రియల్ లైఫ్‌లోనూ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. గతంలో బుల్లితెరపై సుమ హోస్ట్ చేసిన ‘క్యాష్’ ప్రోగ్రాంలో అనుదీప్ తన పంచులతో ఎంత వైరల్ అయ్యాడో అందరికీ తెలిసిందే.

ఆ కార్యక్రమంలో అనుదీప్ చేసిన కామెడీ మీమర్స్‌కు చాలా ఉపయోగపడే కంటెంట్‌గా మారి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి అదే తరహా కామెడీ టైమింగ్, పంచులతో మరోసారి సుమ హోస్ట్ చేస్తున్న ‘సుమ అడ్డా’ కనిపిస్తున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 28న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర టీమ్ ‘సుమ అడ్డా’ షోలో పాల్గొన్నారు.

ఈ షో ఆద్యంతం సుమ వేసే ప్రశ్నలకు అనుదీప్ మరోసారి తనదైన పంచులతో ప్రేక్షకులకు నవ్వులు తెప్పించనున్నాడు. ఆయన కామెడీ టైమింగ్‌తోనే ఈ షోకు సంబంధించిన ప్రోమో అదిరిపోయింది. ఇక ఈ షోలో ఆయన చేసిన సందడి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తగా చూస్తున్నారు. ఆయనతో పాటు మ్యాడ్ స్క్వేర్ టీమ్ కూడా చేసే సందడిని వీక్షించేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ షో మార్చి 16న ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు