ఫోటో మూమెంట్: దుబాయ్‌లోని ఓ పెళ్లి వేడుకలో సందడి చేసిన ఎన్టీఆర్

ఫోటో మూమెంట్: దుబాయ్‌లోని ఓ పెళ్లి వేడుకలో సందడి చేసిన ఎన్టీఆర్

Published on Feb 23, 2025 12:01 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్రస్తుతం తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఎన్టీఆర్-నీల్‌ను ఇటీవల స్టార్ట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ భారీ యాక్షన్ సీక్వె్న్స్‌తో స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, షూటింగ్ సెట్‌లో కంటే ముందే ఎన్టీఆర్ ఓ వివాహ వేడుకలో మెరిశాడు.

దుబాయ్‌లో జరుగుతున్న ఓ ప్రైవేట్ వెడ్డింగ్ ఈవెంట్‌లో పలువురు సినీ స్టార్స్ సందడి చేశారు. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి తో సహా హాజరయ్యారు. వారు మహేష్ బాబు భార్య నమ్రత శిరోధ్కర్ అండ్ గ్యాంగ్‌తో దిగిన ఓ ఫోట నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో తారక్ మళ్లీ స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు