వెంకటేష్ గారే నాకు స్ఫూర్తి అంటున్న అక్కినేని హీరో

వెంకటేష్ గారే నాకు స్ఫూర్తి అంటున్న అక్కినేని హీరో

Published on May 19, 2013 12:15 PM IST

Nagachaithanya-and-venkates
‘తడాఖా’ సినిమా విజయంతో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కంఫర్టబుల్ జోన్ లోకి అడుగు పెట్టాడు. ఏడు సినిమాల ప్రస్థానం కలిగిన నాగచైతన్య నిజజీవితంలో చాలా తక్కువగా మాట్లాడే మనస్తత్వం, అలాగే తన పనేదే తను చూసుకునే మనస్తత్వం కలవాడు.

ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ నేను 18 సంవత్సరాలు చెన్నైలోనే పెరిగాను. ఆ టైములో హైదరాబాద్లో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నాకేమీ తెలియదు. 19 వ సంవత్సరం లోకి అడుగుపెట్టాకే సినిమాల్లో నటించాలి అనేదాని గురించి ఆలోచించాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు నా అంకుల్ అయిన వెంకటేష్ గారితో చాలా టైం గడిపేవాన్ని, నాకు ఆయనే స్ఫూర్తి. నేను కూడా ఆయనలాగే కొంచెం మొహమాటం, పబ్లిక్ లో ఎక్కువగా కనపడాలనుకోను. ఆయన తన ఫ్యామిలీతో ఎంతో క్లోజ్ గా ఉంటారు, ఆయనలో నాకు ఎక్కువగా నచ్చింది అదే. చాలా విషయాల్లో నేను ఆయనలానే ఉంటానని’ అన్నాడు.

‘తడాఖా’ సినిమా తర్వాత నాగ చైతన్య త్వరలోనే దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు, అలాగే జూన్ నుంచి అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి చేయనున్న ‘మనం’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ‘హలో బ్రదర్’ రీమేక్ మరియు కన్నడ సినిమా ‘చార్మినార్’ లో నటించనున్నాడు.

తాజా వార్తలు