వాయిదాపడిన ఇద్దరమ్మాయిలతో విడుదల

వాయిదాపడిన ఇద్దరమ్మాయిలతో విడుదల

Published on May 18, 2013 6:03 PM IST

Iddarammailatho11

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా విడుదల కొన్ని అనివార్య కారణాలవల్ల మే 31కి వాయిదాపడింది. ముందుగా ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర విడుదలను ఇంకొక వారంపాటు వాయిదా వేసారని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా అమలా పాల్, కేథరీనె త్రేస కనిపించనున్నారు. బ్రహ్మానందం ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత.

తాజా వార్తలు