రజనికాంత్ సినిమాను పొగుడుతున్న స్వర మాంత్రికుడు

రజనికాంత్ సినిమాను పొగుడుతున్న స్వర మాంత్రికుడు

Published on May 15, 2013 10:45 PM IST

AR_Rahaman
తాను పనిచేస్తున్న సినిమాల విషయాల గురించి తక్కువగా మాట్లడే వ్యక్తి ఏ.ఆర్ రెహమాన్. అతని తాజా తమిళ చిత్రం ‘మారియన్’ ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా వుంటే మన ఆస్కార్ విజేత తాను రజనికాంత్ తో కలిసి పని చేస్తున్న ‘కొచ్చాడయాన్’ ప్రివ్యూ చూసిన ఆనందంలో ఒక ముఖ్య విషయాన్ని బయటపెట్టారు. ఫుటేజ్ చుసిన తరువాత ఏ.ఆర్ రెహమాన్ “రజని సార్ నటించిన ‘కొచ్చాడయాన్’ లో ఒక పాటలో వాడిన మోషన్ కాప్చ్యూర్ పరిజ్ఞానాన్ని చూసాను. యానిమేషన్ అత్యున్నత స్థాయిలో వుంది.. అద్బుతం”అని తెలిపారు.
ఈ సినిమాలో రజినికాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె, శరత్ కుమార్, నస్సార్, శోభన మరియు రుక్మిణి విజయ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సౌందర్య రజని కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో విడుదల చేయనున్నారు. తెలుగులో ‘విక్రం సింహా’గా రానున్న ఈ సినిమా అనువాద హక్కులను లక్ష్మి గణపతి ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలకానుంది.

తాజా వార్తలు