తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్లో ఒక అద్బుతమైన కాంబినేషన్ కు తెరలేవనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘మిర్చి’ దర్శకుడు కొరటాల శివతో కలిసి పనిచెయ్యనున్నాడు. సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్లోనే హాట్ హీరొయిన్లైన సమంత, కేథరినే త్రేస నటించనున్నారు. ఈ వార్త అధికారికంగా ప్రకటించాల్సివుంది.
ఈ కాంబినేషన్ కనుక కార్యరూపందాలిస్తే ఫాన్స్ కు పండుగ వాతారవణమే. సమంతకు ఇప్పటికే అభిమానులు చాలా మందివున్నారు, కేథరినే త్రేస కూడా అభిమానులను అలరిస్తుంది. ఈ జోడీకు రామ్ చరణ్ కుడా జతకడితే అది నిజంగా అద్బుతమే.
బండ్ల గణేష్ ఈ సినిమాను పరమేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలకోసం మా సైట్ ను చూస్తూవుండండి ఫ్రెండ్స్…