వెంకీ – రామ్ ల ‘గరం మసాల’ ?

వెంకీ – రామ్ ల ‘గరం మసాల’ ?

Published on May 14, 2013 4:00 PM IST

venky-ram

విక్టరీ వెంకటేష్ – రామ్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ‘గరం మసాల’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా గత సంవత్సరం హిందీలో విడుదలై హిట్ అయిన ‘బోల్ బచ్చన్’ సినిమాకి రీమేక్. హిందీలో అజయ్ దేవగన్ చేసిన పాత్రని వెంకటేష్ చేస్తున్నారు, అభిషేక్ బచ్చన్ చేసిన పాత్రని రామ్ చేస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత రెండో సారి వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది, రామ్ సరసన షాజన్ పాదంసీ జోడీ కడుతోంది. కామెడీని బాగా చూపించగల విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సురేష్ బాబు – స్రవంతి రవికిషోర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ బెంగుళూరులో జరుగుతోంది.

తాజా వార్తలు