థమన్ క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఫోకస్ పెట్టనున్నాడా?

థమన్ క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఫోకస్ పెట్టనున్నాడా?

Published on May 13, 2013 7:00 PM IST

thaman-(2)

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. థమన్ సినిమా తర్వాత మరో సినిమాకి చాలా వేగంగా మ్యూజిక్ చేస్తున్నాడు. కొన్ని సార్లు ట్యూన్స్ లో క్వాలిటీ తగ్గడం ఆ సినిమా పై ప్రభావం చూపుతోంది. ఆ విషయం తెలుసుకున్న థమన్ ఇకనుంచి కాస్త స్లోగా సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది.

ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం భవిష్యత్తులో థమన్ క్వాంటిటీ కంటే క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నాడు. ఇలా సడన్ గా తీసుకున్న నిర్ణయం నిజమో కాదో అనే దాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం తమన్ చాలా పెద్ద సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి నుంచే అమలు చేస్తాడా లేక ఉన్న కమిట్ మెంట్స్ అయ్యాక చేస్తాడా అనేది చూడాలి.

మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ నిర్ణయానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఈ నిర్ణయం థమన్ మ్యూజిక్ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందా? అనే ప్రశ్నలకి మీ సమాధానాన్ని కింద కామెంట్స్ లో తెలపండి.

తాజా వార్తలు