అల్ టైం గ్రేటెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైన మాయా బజార్

అల్ టైం గ్రేటెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైన మాయా బజార్

Published on May 12, 2013 8:00 PM IST

Mayabazar
ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, సావిత్రి, ఎస్.వి రంగారావు ప్రధాన తారాగణంగా నటించిన ‘మాయా బజార్’ సినిమా సిఎన్ఎన్ – ఐబిఎన్ నిర్వహించిన ఓటింగ్ లో ఆల్ టైం గ్రేట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఇండియన్ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 100 టాప్ ఫిల్మ్స్ లిస్టులో పలు ఇండస్ట్రీల నుండి ఎంపికైన ‘మాయా బజార్’ ఈ సారి పోల్ పూర్తయ్యే సమయానికి 16,960 ఓట్లు సంపాదించుకుంది. మొత్తంగా వచ్చిన ఓటింగ్ లో 23.91% మాయా బజార్ కే దక్కింది. అందరినీ ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే హిందీ సినిమాలైన ‘షోలే’, ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ లాంటి సినిమాలను దాటేసుకొని ముందుకి వచ్చేసింది. అలాగే నాగార్జున – అమల నటించిన ‘శివ’ సినిమా కూడా టాప్ 10 సినిమాలలో ఒకటికా నిలిచింది. ఇది కూడా చాలా ఆశ్చర్యకరంగా ‘మనిచిత్రతజు’, ‘ఒరు వడక్కన్ వీరగత’ లాంటి మలయాళం సినిమాలను దాటుకొని టాప్ ఫిల్మ్స్ లిస్టులో స్థానం దక్కించుకుంది.

తాజా వార్తలు