తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో,నటనతో ఆకట్టుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా ఈ వారం విడుదలైన ‘తడాఖా’ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. నాగ చైతన్య, సునీల్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆండ్రియా జెరేమియా మరో హీరోయన్ గా కనిపించింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ సినిమాలు చేయడం, ప్రమోషన్స్ విషయానికొచ్చే సరికి వేరే సినిమా షూటింగ్లో ఉన్నామనో, అవుట్ డోర్ లో ఉన్నామనో చెప్పి తప్పించుకుంటున్న సమయంలో మన తమన్నా మాత్రం తన ప్రతి సినిమా ప్రమోషన్స్ లో బాగానే పాల్గొంటోంది.
దానికి గల కారణం ఏంటా అని అడిగితే తమన్నా సమాధానం చెబుతూ ‘ ప్రస్తుతం ఒక సినిమా కథ విని ఒప్పుకొని, దాని కోసం రాత్రి పగలు ఎంత కష్టపడి పని చేసినా అది జనాలకు రీచ్ కాకపోతే మన శ్రమ వృధా అవుతుంది. అందుకే ప్రమోషన్ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా నేను ఎంత బిజీగా ఉన్నా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కొంత టైం కేటాయిస్తాను. అలాగే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ప్రమోట్ చెయ్యడం కంటే మూవీ యూనిట్ తో కలిసి ఆడియన్స్ ముందుకి వెళితే అ సందడే వేరుగా ఉంటుందని’ అంది.