మీడియా ప్రశంశలు అందుకున్న యాక్షన్3డి

మీడియా ప్రశంశలు అందుకున్న యాక్షన్3డి

Published on May 11, 2013 11:40 PM IST

Action-3d
కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటిస్తున్న ‘యాక్షన్ 3డి’ సినిమా బృందమంతా నిన్న ఇన్ ఆర్బిట్ మాల్ లో మీడియా ముందు సమావేశమయ్యింది. ఈ సినిమా పాటలను 3డి ఫార్మాట్లో ప్రదర్శించి అందిరి మన్ననలను పొందారు. సినిమా బృందం, మీడియా బృందం కలిసి అనీల్ సుంకర అంతర్జాతీయ 3డి ఫార్మాట్ ను తెలుగు సినిమాకు తీసుకురావడానికి పడ్డ కృషికి అందరూ అభినందించారు.

అల్లరి నరేష్ సినిమాపై చాలా నమ్మకంగా వున్నాడు. “అనీల్ సుంకర నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతను చాలా కుతూహలం వున్న దర్శకుడు. అతను ఈ సినిమాను చాలా ఓర్పుతో తీసాడని, ఈ 3డి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ కెయిత్ అంతర్జాతీయ పరిమాణాలను మనకు అందించాడని “అన్నాడు

ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమా మరికొన్ని వారాలలో విడుదలకానుంది.

తాజా వార్తలు