స్లోవేనియాలో సందడి చేస్తున్న మంచు విష్ణు

స్లోవేనియాలో సందడి చేస్తున్న మంచు విష్ణు

Published on Apr 25, 2013 1:00 PM IST

VishnuManchu

హీరో విష్ణు మంచు నటిస్తున్న సినిమా ‘దూసుకెల్తా’. ప్రస్తుతం విష్ణు ఈ సినిమాలో పాటల చిత్రీకరణలో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు వీరు పోట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని సాంగ్స్ ని స్లోవేనియా, ఇటలీ, స్విట్జర్లాండ్ లలో చిత్రీకరించనున్నారు. అందాల రాక్షసి ఫేం లావణ్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం విష్ణు ఫ్యామిలీతో కలిసి స్లోవేనియాలో ఉన్నాడు. ఇక్కడ అందమైన సరస్సులు, పర్వతాలు ఉన్నాయి. విష్ణు కూతుర్లు అరియాన, వివియాన సమర్పణలో 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై డా. మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మంచు ఫ్యామిలీ మొత్తం త్వరలో ఒక మల్టీ స్టారర్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ముహూర్తం ఈ మధ్యే జరిగింది.

తాజా వార్తలు