మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న నవదీప్-ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ల సినిమా

మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న నవదీప్-ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ల సినిమా

Published on Apr 24, 2013 4:30 PM IST

Navadeep

ఈ మధ్యే మొదలైన నవదీప్ నూతన చిత్రం మొదటి షెడ్యూల్ ని ముగించుకుంది. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని లెజెండ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ బాబు నిర్మిస్తున్నారు. కావ్య శెట్టి మరియు జియా ఖాన్ హీరోయిన్స్. ప్రధాన తారాగణం నడుమ కొన్ని ముఖ్య సన్నివేశాలు, నవదీప్ తో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మే 2 నుండి 21 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్ తో మొత్తం టాకీ భాగం ముగుస్తుంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ప్రతీ మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. పరిస్థితులను బట్టి అతను హీరో గానో, విలన్ గానో మారతాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ దీని ఆధారంగానే నడుస్తుంది. ఈ సినిమా చాలా అందంగా తెరకెక్కుతుంది. నిర్మాత ఖర్చుకు వెనకాడటం లేదని”తెలిపారు.

తాజా వార్తలు