విజయవంతంగా దూసుకుపోతున్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’

విజయవంతంగా దూసుకుపోతున్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’

Published on Apr 23, 2013 4:31 PM IST

GJG4
నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా అన్ని ఏరియాలో సూపర్బ్ గా ప్రదర్శించబడుతోంది. నితిన్ కెరీర్ లోనే భారీ అమౌంట్ ను వసూలు చేస్తున్న సినిమా ఇది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా యుఎస్ఎ లో రూ. 84లక్షల షేర్ సాదించింది, కానీ దానికన్నా ఎక్కువ కూడా కలెక్ట్ చేసి ఉండవచ్చునని బావిస్తున్నారు. మంగళవారం కూడా ఈ సినిమా టికెట్స్ కి ఎ – సెంటర్స్ లో మంచి డిమాండ్ ఉంది. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ ని అందించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ఆండ్రూ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. నిత్యా మీనన్, ఇషా తల్వార్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.

తాజా వార్తలు