గోపిచంద్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘సాహసం’ సినిమా కొన్ని పాటలు మినహా పూర్తయింది. ఈ సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అసోషియేషన్ తో శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గోపీచంద్, తాప్సీ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టీం కొన్ని పాటల చిత్రికారణ కోసం కొచ్చికి వెళ్లనున్నారు. చంద్రశేఖర్ యేలేటి మొదటి యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘సాహసం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ మధ్యే విడుదలచేశారు.
నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాని కొన్ని అందమైన లోకేషన్స్ లో షూట్ చేశామని అన్నాడు. అలాగే ఈ సినిమా భారీ విజయం సాదిస్తుందని నమ్మకంతో వున్నాడు. ఈ సినిమా ఇప్పటి వరకు హైదరాబాద్, లదాఖ్, మరి కొన్ని ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ సినిమా కథాంశం నిధి కోసం ఒక సామాన్య మైన వ్యక్తి వేటాడడం చుట్టూ తిరుగుతూ వుంటుంది. శ్రీ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి శందాత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా మే చివరివారంలో విడుదలయ్యే అవకాశం వుంది.