కూకట్ పల్లి లో మహేష్ బాబు సినిమా షూటింగ్

కూకట్ పల్లి లో మహేష్ బాబు సినిమా షూటింగ్

Published on Apr 12, 2013 12:20 PM IST

Mahesh-sukumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ కోసం ప్రాక్టిస్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిన్న రాత్రి కుకట్ పల్లిలో జరిగింది. నిన్నరాత్రి ఇక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు, మిగిలిన వాటిని ఈ రోజు రాత్రి షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కొత్తగా కనిపించనున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పేరు ఖరారు కాని ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, భారీ విజయాన్ని సాదించిన మహేష్ బాబు ‘దూకుడు’ సినిమాని ఈ బ్యానర్ పైనే నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ సినిమాని స్టైలిష్, యాక్షన్ తో, కొత్తరకం మ్యూజిక్ తో థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం.

తాజా వార్తలు