‘గబ్బర్ సింగ్ 2’ కి డైరెక్టర్ గా సంపత్ నంది

‘గబ్బర్ సింగ్ 2’ కి డైరెక్టర్ గా సంపత్ నంది

Published on Apr 12, 2013 11:30 AM IST

Pawan-and-Sampath-Nandi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సంపత్ నందికి చాలా కష్టమైనా పనిని అప్పగించారు. పవన్ కళ్యాణ్ ఈ యంగ్ డైరెక్టర్ కి ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా 2012లో విడుదలై ఘన విజయాన్ని సాదించిన విషయం మనందరికి తెలుసు. అంతే కాకుండా ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమా సాదించని కలెక్షన్లను సాదించింది. ఈ సినిమాకు సీక్వెన్స్ గా వస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ కి దర్శకత్వం వహించడం అంత సులభమైన పని కాదు. దీనిలో సంపత్ నంది విజయాన్ని సాదించాలని కోరుకుందాం.

పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మాతగా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మే మూడవ వారం నుండి జరిగే అవకాశం వుంది. ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో వుంది. ‘గబ్బర్ సింగ్’ సినిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా బండ్ల గణేష్ నిర్మించాడు.

తాజా వార్తలు