26న విడుదలకు సిద్దమవుతోన్న గ్రీకు వీరుడు

26న విడుదలకు సిద్దమవుతోన్న గ్రీకు వీరుడు

Published on Apr 12, 2013 8:11 AM IST

Greekuveerudu (1)
‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘గ్రీకు వీరుడు’ సినిమా ఏప్రిల్ 26న విడుదల కావడానికి సిద్దమవుతోంది. ముందుగా ఈ సినిమాని శ్రీరామనవమి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ ఈ సినిమా కొంత ఆలస్యంగా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 26న కూడా రిలీజ్ కాదనే రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ ఖచ్చితంగా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదలవుతుందని మేము తెలియజేస్తున్నాము.

దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని కామాక్షి మూవీస్ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ముందుగా ఈ సినిమాకి ‘లవ్ స్టొరీ’ అనే టైటిల్ ని అనుకున్నారు. నాగార్జున ఈ సినిమాలో ఎన్నారై ఈవెంట్ మేనేజర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా సెకండాఫ్ లో ఫ్యామిలీ విలువలు, సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని సమాచారం.

తాజా వార్తలు