ఏప్రిల్12న విడుదలకానున్న ‘ప్రేమ కథ చిత్రం’ ఆడియో

ఏప్రిల్12న విడుదలకానున్న ‘ప్రేమ కథ చిత్రం’ ఆడియో

Published on Apr 11, 2013 8:23 PM IST

Prema-katha-chitram

సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘ప్రేమ కథ చిత్రం’ సినిమా ఆడియోని రేపు అనగా ఏప్రిల్ 12న హైదరాబాద్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నిర్వాహకులు ఈ ఆడియో తేదిని ఏప్రిల్ 12గా నిర్ణయించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి మహేష్ బాబు ముఖ్య అతిధిగా రాబోతున్నారు. ఇది సుదీర్ బాబు నటిస్తున్న రెండవ సినిమా. దీనిలో నందిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మారుతీ ఈ సినిమాకి డైలాగ్స్ , స్టోరీ, స్క్రీన్ ప్లే ను అందించారు. ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి జె.బీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా మే మూడవ వారం లో విడుదలయ్యే అవకాశం వుంది.

తాజా వార్తలు