మే చివర్లో రానున్న రవితేజ బలుపు

మే చివర్లో రానున్న రవితేజ బలుపు

Published on Apr 11, 2013 4:09 AM IST

Balupu

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘బలుపు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాని మే చివరి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక మే మొదటి వారంలో ఉండొచ్చు, అది కూడా విజయవాడలో జరిగే అవకాశం ఎక్కువ. శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని డైరెక్టర్. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత రవితేజ ఫుల్ గడ్డంతో అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ తో కనిపించనున్నాడు.

తాజా వార్తలు