రామ్ చరణ్ ,ప్రియాంక చోప్రా జంటగా నటించిన ‘ తూఫాన్’ చిత్రం నిర్మానంతరపు పనులు పూర్తిచేసుకోకముందే మరో ఆటంకం ఎదురైంది . కొన్ని రోజుల క్రితం బోంబే హై కోర్ట్ ‘తూఫాన్’ నిర్మాత అమిత్ మెహ్ర తనని కోర్టుకి లాగిన తన సోదరులు సుమీత్ మరియు పునీత్ మెహ్ర లతో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత అన్ని ఆటంకాలు ని తొలగించింది .
తాజా సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ కి కథ ని అందించిన సలీం ఖాన్ మరియు జావేద్ అక్తర్ బోంబే హై కోర్ట్ లో చిత్ర విడుదల ను కాపీరైట్ ఉలంఘన కింద నిలిపివేయవలసిందిగా ఒక పిటిషన్ దాఖలు చేసారు . ఈ విషయమై దాదాపు ఏడాది క్రితం మాట్లాడిన ఈ ఇద్దరు అమిత్ మెహ్ర ఈ చిత్రం రీమేక్ చెయ్యడానికి తమ అంగీకారం తీసుకోలేదని కోర్ట్ కి వినవించారు . తాజా గా వచ్చిన ఈ పిటిషన్ పై బోంబే హై కోర్ట్ నిర్ణయం తీసుకోవాల్సివుంది .
ఇదిలావుండగా వచ్చే వారం కోర్ట్ లో లొంగిపొన్నున సంజయ్ దత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించాడు. ఈ చిత్ర దర్శకుడు అపూర్వ లాఖియా మిగిలిన భాగాల్ని చిత్రీకరిస్తూ స్వయంగా నిర్మానంతరపు పనుల్ని పర్యవేక్షిస్తున్నాడు . షేర్ ఖాన్ పాత్రను ‘జంజీర్’ తెలుగు వెర్షన్ ‘తూఫాన్’లో శ్రీహరి పోషిస్తున్నారు . అంతా సవ్యం గా జరిగితే ఈ చిత్రం ఈ ఏదాది ద్వితియార్ధం లో విడుదల కానుంది .