పూర్తికావచ్చిన ప్రేమ కధా చిత్రమ్

పూర్తికావచ్చిన ప్రేమ కధా చిత్రమ్

Published on Apr 4, 2013 6:10 PM IST

Prema-katha-chitram

సుదీర్ బాబు ‘ ప్రేమ కధా చిత్రమ్’ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. సుదీర్ బాబు సరసన ఈ సినిమాలో నందిత నటిస్తుంది. జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వమే కాక సినిమాటోగ్రఫీ బాధ్యతలు కుడా నిర్వహించనున్నాడు. మారుతి పర్యవేక్షణలో సాగుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య జరుగుతున్న ప్రస్తుత షూటింగ్ తో సినిమా చిత్రీకరణ పుర్తవుతుందట.

“రేపటి నృత్య గీతం చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఈ పాటను ఏప్రిల్ మధ్యలో తీద్దాం అనుకున్నాము కానీ 10న జరిగే ఆడియో ఫంక్షన్ కి అవసరం అవ్వడంతో ఇప్పుడే చేస్తున్నాము. నేను సాధారణ నటుడినే కానీ ప్రేక్షకులు నా నుండి ఏదో ఉహించడం వాళ్ళ నాకు కాస్త భయం కలుగుతుందని ” సుదీర్ బాబు ట్వీటిచ్చాడు. జె.బి సంగీతం సమకూర్చాడు. ఏప్రిల్ 10 న ఆడియో లాంచ్ జరగనుండగా మే 10న సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే ఇందులో పచ్చని కాపురం సినిమాలో కృష్ణ మరియు శ్రీ దేవి నటించిన ‘వెన్నెలైన చీకటైన’ పాటను రీమిక్స్ చేసారు.

‘ ప్రేమ కధా చిత్రమ్’ కాకుండా సుదీర్ బాబు ఆర్.కె తీస్తున్న ‘ఆడు మగాడురా బుజ్జి’ సినిమాలో మరియు మున్నా తీస్తున్న మరో చిత్రంలో నటించడానికి అంగీకరించాడు.

తాజా వార్తలు