పవన్ కళ్యాణ్ సెట్ ఖరీదు మూడు కోట్లట.!

పవన్ కళ్యాణ్ సెట్ ఖరీదు మూడు కోట్లట.!

Published on Apr 4, 2013 6:00 PM IST

Pawan
ఈ కాలంలో భారీ సెట్లు వెయ్యడం బాగా ప్రసిద్ది చెందింది. ఈ ఏడాది మొదట్లో ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్ ప్రకాష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి గాను ఒక కాలనీ సెట్ నీ, ఈమధ్యే ఒక పాట కోసం అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ లో వై.వి.ఎస్ చౌదరి ‘రేయ్’ కోసం 1.5 కోట్ల సెట్ ని వేసారు. అలాగే తోట తరుణీ గుణశేఖర్ తీస్తున్న ‘రుద్రమదేవి’ కోసం కళ్ళు చెదిరే సెట్ వేసాడట

తాజా కధనాల ప్రకారం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పవన్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమాకి 3కోట్ల ఇంటి సెట్ ని వేసారట. ఇది తెలుగు చిత్ర సీమలో ఇప్పటివరకూ వేసిన భరీ సెట్లలో ఒకటిగా నిలిచింది. ఇదివరకు ‘అతడు’ కోసం ఇంటి సెట్ వేసిన త్రివిక్రమ్ ఆ తరువాత చాలా చిత్రాలకు ఆ సెట్ నే ఆధారం అయ్యేలా చేసాడు. ఇప్పుడు పవన్ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ వార్తలలోకి ఎక్కింది. పవన్ సరసన సమంత, ప్రణీత సుభాష్ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత.

తాజా వార్తలు