ఐ.పి.ఎల్ మ్యాచ్ లో ఆడియో లాంచ్

ఐ.పి.ఎల్ మ్యాచ్ లో ఆడియో లాంచ్

Published on Apr 3, 2013 11:16 PM IST

Gouravam

శిరీష్, యామి గౌతం నటిస్తున్న ‘గౌరవం’ చివరికి ఏప్రిల్ 19 న విడుదలకానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదల చేసారు. ప్రచార కార్యక్రమాలు కూడా వినూత్న రీతిలో మొదలుపెట్టనున్నారు. సరికొత్త కధనాల ప్రకారం ఈ సినిమా ఆడియో లాంచ్ ఏప్రిల్ 5న సన్ రైసెర్స్ హైదరాబాద్ కి పూణే వారియర్స్ కి మధ్య ఉప్పల్ స్టేడియంలో విడుదలకానుంది. ఈ సినిమా యొక్క తమిళ్ వెర్షన్ ఆడియో ఒక ప్రముఖ టి.వి షోలో జరిగింది. ఈ కార్యక్రమంలో కులాంతర వివాహాలు, ప్రేమ సంగతులు గురించి చర్చ జరిగింది.

ఈ ద్విభాషా చిత్రాన్ని రాధ మోహన్ తెరకేక్కిస్తుండగా డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రీతా సినిమాటోగ్రాఫర్. లండన్ లో షూటింగ్లో బిజీగా ఉన్న యామి గౌతం త్వరలో ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గోనుంది. పద్ధతులని, అచారాలని మార్చుకొని ఒక గ్రామంలో హానర్ కిల్లింగ్స్ నేపధ్యంలో ఈ చిత్రం సాగుతుంది .

తాజా వార్తలు