ఆగష్టు 15న రానున్న ‘విశ్వరూపం 2’

ఆగష్టు 15న రానున్న ‘విశ్వరూపం 2’

Published on Apr 3, 2013 7:00 PM IST

Vishwaroopam

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న ‘విశ్వరూపం 2’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కొన్ని వివాదాలను ఎదుర్కొని విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడిన ‘విశ్వరూపం’ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాని ఆగష్టు 15న విడుదల చేయాలని కమల్ హాసన్ ప్లాన్ చేస్తున్నారు, ఈ లోపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకి సంబందించిన ముఖ్యమైన సన్నివేశాల్ని ఇప్పటికే చిత్రీకరించడం జరిగింది. ‘విశ్వరూపం 2’ సినిమా భారతదేశంలో జరిగే సంఘటనల గురించి ఉంటుందని సమాచారం. ‘విశ్వరూపం’ సినిమాలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న పూజ కుమార్ ఈ సినిమా సీక్వెల్ లో కూడా ఒక వైవిధ్యమైన పాత్రలో పోషిస్తోంది. కమల్ హసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో ఎక్కడ రాజీపడకుండా నిర్మిస్తున్నారు , అలాగే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు.

తాజా వార్తలు