తెలుగులో క్రేజీ గా రానున్న ఢిల్లీ బెల్లీ రీమేక్

తెలుగులో క్రేజీ గా రానున్న ఢిల్లీ బెల్లీ రీమేక్

Published on Apr 3, 2013 1:40 PM IST

Crazy

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థలో వచ్చి హిట్ అయిన ‘ఢిల్లీ బెల్లీ’ రీమేక్ ని తమిళ భాషలో రీమేక్ చేస్తున్నారు. ‘సెట్టై’ పేరుతో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాని ‘క్రేజీ’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయనున్నారు. తమిళంలో యుటివి మోషన్ పిక్షర్స్ వారు నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ఎస్.కె పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి తెలుగులో అనువదిస్తున్నారు. ఆర్య, హన్సిక, అంజలి, సంతానం, ప్రేంజీ అమరేన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఆర్. కన్నన్ దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 4న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. తమిళంలో ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఉగాది కానుకగా తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు