గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న ‘బాద్షా’

గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న ‘బాద్షా’

Published on Apr 3, 2013 4:30 PM IST

Baadshah

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా తూర్పు గోదావరి జిల్లాలో 90 థియేటర్స్ పైగా విడుదలవుతోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 70 థియేటర్స్ పైగా విడుదలవుతోంది. ఈ సినిమాకి విడుదలకు ముందే మంచి స్పందన రావడంతో, అలాగే స్టూడెంట్స్ కి హాలిడేస్ కావడంతో భారీ విజయాన్నిసాదిస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకంతో వున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో పూర్తి కామెడీగా సాగే సినిమాలు తీయడంతో శ్రీను వైట్లకి మంచి పేరుందని మనకు తెలుసు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నవదీప్ విలన్ గా కనిపించనున్నాడు. సిదార్థ్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ఎం.ఆర్.వర్మ ఎడిటర్ . పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచమంతటా గ్రాండ్ గా విడుదలకానుంది.

తాజా వార్తలు