సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘దూకుడు’ సినిమా చేసి డైరెక్టర్ శ్రీను వైట్ల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒకవైపు శ్రీను వైట్ల ఎన్.టి.ఆర్ తో చేసిన ‘బాద్షా’ సినిమా రిలీజ్ కి దగ్గరవుతోంది, మరో వైపు శ్రీను వైట్ల మహేష్ బాబు తో చేయనున్న తన నెక్స్ట్ సినిమా ‘ఆగడు’ కోసం సిద్దమవుతున్నాడు. శ్రీను వైట్ల ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు అలాగే ‘దూకుడు’ సినిమా కంటే ‘ఆగడు’ సినిమాలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలియజేశారు.
శ్రీను వైట్ల సింహాచలంలో మీడియా మిత్రులతో సమావేశం అయినప్పుడు మాట్లాడుతూ ‘ మహేష్ బాబుతో చేసే సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళుతుంది. ఈ సినిమాలో ‘దూకుడు’ కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని ‘ అన్నారు.
’14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్ వారు ప్రస్తుతం మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాని కూడా నిర్మిస్తున్నారు.