రిలీజ్ కి సిద్దమవుతున్న యాక్షన్ 3డి

రిలీజ్ కి సిద్దమవుతున్న యాక్షన్ 3డి

Published on Apr 3, 2013 12:00 PM IST

Action_3d

కామెడీ కింగ్ అల్లరి నరేష్ కెరీర్లో బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘యాక్షన్ 3డి’ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అడ్వాన్స్ 3డి టెక్నాలజీతో తెరకెక్కించారు. ఇండియాలో 3డి టెక్నాలజీతో తెరకెక్కిన మొట్ట మొదటి కామెడీ సినిమా ఇదే.

వైభవ్, శ్యాం, రాజు సుందరం ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కామ్న జఠ్మలాని, నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్, శీన హీరోయిన్స్ గా నటించారు. అనీల్ సుంకర దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి బప్పి లహరి – బప్పా లహరి సంగీతం అందించారు.

తాజా వార్తలు