లక్ష్మీ మంచుని సత్కరించనున్న యుఎస్ యూనివర్సిటీ

లక్ష్మీ మంచుని సత్కరించనున్న యుఎస్ యూనివర్సిటీ

Published on Apr 3, 2013 3:15 AM IST

Lakshmi-Manchu1
నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మంచుని ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ స్కూల్ అఫ్ థియేటర్ వారు సత్కరించనున్నారు. ప్రతి సంవత్సరం ఈ యూనివర్సిటీ వారు అక్కడే చదివి కళారంగంలో రాణిస్తున్న ఐదు మందిని ఎంపిక చేసి సత్కరిస్తుంది. ఈ ఐదు మందిలో లక్ష్మీ మంచు కూడా ఉన్నారు. ఈ సత్కార కార్యక్రమం శుక్రవారం జరగనుంది.
ఓక్లహోమా సిటీ యూనివర్సిటీలో తన గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన లక్ష్మీ మంచు ప్రస్తుతం యూనివర్సిటీ అఫ్ సౌతెర్న్ కాలిఫోర్నియా లో తన తదుపరి ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్స్ చేస్తోంది. దీనికి సంబందించిన ప్రెస్ నోట్ కోసం కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చెయ్యండి – http://www2.okcu.edu/news/?id=6864
ఈ సందర్భంగా లక్ష్మీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు