రుద్రమదేవి 3డి తో నటుడిగా మారనున్న ఫేమస్ సింగర్

రుద్రమదేవి 3డి తో నటుడిగా మారనున్న ఫేమస్ సింగర్

Published on Apr 3, 2013 3:20 AM IST

baba

అందరికీ బాగా పరిచయం ఉన్న ఇండియన్ ఫేమస్ సింగర్ బాబా సెహగల్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి 3డి’ సినిమాతో నటుడిగా మారనున్నాడు. ఈ సినిమా కోసం బాబా సెహగల్ ఈ రోజు కాస్ట్యూమ్స్ ట్రైల్ షూట్ లో పాల్గొన్నాడు, ఆ ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసాడు. నిదవర్ధ్యపురం(ప్రస్తుతం నిడదవోలు) యువరాజ చాళుక్య వీరభద్ర పాత్రలో రానా నటిస్తున్న ఈ మూవీలో టైటిల్ రోల్ లో అనుష్క నటిస్తోంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకనిర్మాత.

తాజా వార్తలు