బాద్షా కి సెన్సార్ డేట్ ఖరారు

బాద్షా కి సెన్సార్ డేట్ ఖరారు

Published on Apr 1, 2013 10:55 PM IST

Baadshah8
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా మార్చి 29 న సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 5న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి బండ్ల గణేష్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు.

స్టైలిష్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంచనా వేస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘బాద్షా’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. సమ్మర్లో రిలీజ్ కానున్న మొదటి పెద్ద సినిమా ఇదే..

తాజా వార్తలు