తెలుగు సినిమాలను నిర్మించడానికి తెగ ఆరాటపడిపోతున్న బాలీవుడ్ స్టూడియోస్

తెలుగు సినిమాలను నిర్మించడానికి తెగ ఆరాటపడిపోతున్న బాలీవుడ్ స్టూడియోస్

Published on Apr 1, 2013 11:50 PM IST

UTV-Relaiance
హిందీ సినిమాయే కాక తమ బిజినెస్ ని వ్యాప్తి చెందటానికి బాలీవుడ్ సంస్థలు ఆరాటపడుతున్నాయి. ఇది సినిమా ప్రొడక్షన్ విధానంలోనే ఒక మార్పు తేగల అంశం. గత కొన్ని సంవత్సరాలుగా యూ.టి.వి మోషన్ పిక్చర్స్ మరియు రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు తెలుగు మరియు తమిళ్ సినిమాలలో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. యూ.టి.వి మోషన్ పిక్చర్స్ ఇప్పటికే ‘తాండవం’, ‘దైవ తిరుమగల్’, ‘వెట్టై’ సినిమాలకు నిర్మాణ సంస్థగా పనిచేసింది. ఈ సినిమాలు అయితే డబ్బింగ్ గానో, లేదా రీమేక్ గానో తెలుగులో కుడా వార్తల్లో వినబడతున్నాయి. రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మన తెలుగు సినిమాల నిర్మాత బి.వి.ఎస్. ఎన్ ప్రసాద్ తో చేతులు కలిపి ‘దేవుడు చేసిన మనుషులు’ మరియు త్వరలో రాబోతున్న పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ సినిమాలను నిర్మిస్తుంది.

ఈ రెండు సంస్థలే కాక, ఈ ఏడాది మరో మూడు ముంబాయి అగ్రనిర్మాణ సంస్థలు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే యశ్ రాజ్ స్టూడియోస్ అదినేత ఆదిత్య చోప్రా, నాని హీరోగా ‘బ్యాండ్ బాజా భారత్’ సినిమాను తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో కుడా అనువాదం కానుంది. మరో పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయిన వియాకం18 మోషన్ పిక్చర్స్ అనుష్క ప్రధాన పాత్రలో ‘కహాని’ సినిమాని రీమేక్ చేయ్యనుంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్, కరణ్ జోహార్ కి హిందీ రేమాక్ల ద్వారా గాని, స్ట్రెయిట్ కధల ద్వారా గానీ టాలీవుడ్లోకి ప్రవేశించాలని ఉందని చెప్పాడు. ఇన్ని పెద్ద సంస్థలు మన తెలుగులోకి ఒకేసారి అడుగుపెడితే అవి మన సినిమాల నిర్మాణంపై, మార్కెటింగ్ పై, డిష్ట్రిబ్యుషన్ పై భారీగా ప్రభావం చూపుతాయి.

తాజా వార్తలు