పోటుగాడు మొదలెట్టాడు

పోటుగాడు మొదలెట్టాడు

Published on Apr 2, 2013 9:40 AM IST

Manoj
మంచు మనోజ్ తాజా చిత్రం ‘పోటుగాడు’ ఈరోజు ఉదయం లాంచనంగా మొదలైంది ఈ సినిమాని బీజాపూర్లో షూట్ చేస్తున్నారు. సినిమా మొత్తం మరో రెండునెలల పాటూ కర్ణాటకలో తెరకేక్కిస్తారు. “బీజాపూర్ చేరుకున్నాము. సూర్యుడు ఆమ్లెట్ లా మండిపోతున్నాడు… ఈ 40డిగ్రీల ఎండలో నేను షర్వానిలో ఉన్నాను.దేవుడా నన్ను కాపాడని” మనోజ్ ట్వీట్ చేసాడు. కన్నడ డైరెక్టర్ పవన్ వాడేయార్ ఈ సినిమాకి దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉండగా వారి పేర్లు గోప్యంగా ఉంచారు. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావచ్చు. ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’ తరువాత సుమారు ఏడాది పోయాక మనోజ్ మళ్లీ నటిస్తున్నాడు

తాజా వార్తలు