30 కోట్ల బడ్జెట్ క్రాస్ చేసిన వెంకటేష్ ‘షాడో’

30 కోట్ల బడ్జెట్ క్రాస్ చేసిన వెంకటేష్ ‘షాడో’

Published on Mar 5, 2013 8:01 PM IST

shadow

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘షాడో’ సినిమా వెంకటేష్ ఎంటైర్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు దాటింది, ముందుగా అనుకున్న దాని కంటే సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత బడ్జెట్ భారీగా పెరిగిందని సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్సులను ఫారిన్ లోకేషన్స్ లో షూట్ చెయ్యడం వల్లే ఇంతలా బడ్జెట్ పెరిగిందని అంటున్నారు.

పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ డైరెక్టర్. మామూలుగా ఈ సినిమా మార్చి 28న విడుదల కావాలి కానీ వాయిదా పడింది. సరికొత్త రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

తాజా వార్తలు