ఖరారైన ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

ఖరారైన ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Published on Feb 12, 2013 12:28 PM IST

ntr-harish-shankar

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు (మే 20న) సందర్భంగా ఫాన్స్ కి కానుకగా రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్.టి.ఆర్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది.

ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2013 సెకండాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మాస్ మసాలా సీన్స్ ని ఎలివేట్ చేసి హీరోయిజం చూపించడంలో, మాస్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ కి మంచి పేరుండడంతో ఎన్.టి.ఆర్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు