స్వామి రారా చిత్రంలో పాట పడిన నిఖిల్,స్వాతి

స్వామి రారా చిత్రంలో పాట పడిన నిఖిల్,స్వాతి

Published on Jan 23, 2013 11:55 PM IST

Swamy-Ra-Ra
నిఖిల్ మరియు స్వాతి “స్వామి రారా” చిత్రం కోసం ఒక పాట పాడారు. నిఖిల్ ఒక పాట పాడటం ఇదే మొదటి సారి, అయన తన గాత్రాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. ఈ చిత్ర ఆడియో కొద్ది సేపటి కిందట విడుదల అయ్యింది ఈ కార్యక్రమానికి పరిశ్రమలోని నిఖిల్ స్నేహితులు మరియు పరిశ్రమ పెద్దలు హాజరయ్యారు. నాని,అల్లరి నరేష్ మరియు మంచు మనోజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిఖిల్ మరియు స్వాతిల వ్యాఖ్యానం ప్రేక్షకులను అలరించింది. వీరిద్దరూ వేదిక మీద ఒక పాట కూడా పాడారు. సుదీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చక్రి చిగురుపాటి నిర్మించారు. ఈ చిత్రం మొత్తం చోరి చెయ్యబడిని ఒక గణేష్ విగ్రహం చుట్టూ తిరుగుతుంది. సన్నీ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.

తాజా వార్తలు