నాగార్జున సాగర్లో ఎన్.టి.ఆర్ తో ఫైట్ చేస్తున్న నవదీప్

నాగార్జున సాగర్లో ఎన్.టి.ఆర్ తో ఫైట్ చేస్తున్న నవదీప్

Published on Jan 23, 2013 3:13 PM IST

NTR-Navadeep

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ నాగార్జున సాగర్ ప్రాంతంలో జరుగనుంది. ఇక్కడ ఎన్.టి.ఆర్ – నవదీప్ పై ఓ ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు. అలాగే విజయ విహార్, అనుపు, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని సీన్స్ తీయనున్నారు.

పైలట్ టీం ఒకటి నాగార్జున సాగర్ వెళ్లి అక్కడ షూటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేయనుంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని సమ్మర్ బ్లాక్ బస్టర్ గా రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు