రామ్ పాత్ర ఒంగోలు గిత్తలా ఉంటుంది.!

రామ్ పాత్ర ఒంగోలు గిత్తలా ఉంటుంది.!

Published on Jan 23, 2013 8:30 AM IST

ongole-gitta

ఎనర్జిటిక్ హీరో రామ్ త్వరలోనే ‘ఒంగోలు గిత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్ర డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ రామ్ పాత్ర చాలా పొగరుగా ఉంటుందన్నారు. ‘ పొగరుకు మారు పేరే ఒంగోలు గిత్త. మా సినిమాకి సరిగ్గా సరిపోయే టైటిల్. ఈ సినిమాలో రామ్ పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా, పొగరుగా ఉంటుంది ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాలో రామ్ ఎనర్జీ లెవల్స్ సినిమాకి హైలైట్ అవుతాయని’ భాస్కర్ ఓ తెలుగు న్యూస్ పేపర్ తో ముచ్చటిస్తూ అన్నారు.

ఫిబ్రవరి 1 న రిలీజ్ కావడానికి సిద్దమవుతున్న ఈ సినిమాలో కృతి కర్బంధ హీరోయిన్ గా నటించింది. జి.వి ప్రకాష్ కుమార్, మణిశర్మ సంయుక్తంగా మ్యూజిక్ అందించారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా భాస్కర్ కెరీర్ కి చాలా కీలకంకానుంది. ఈ సినిమాపైనే తను ఆశలు పెట్టుకున్నాడు.

తాజా వార్తలు