ఇప్పటికీ ఎన్నారైలను ఆకర్షిస్తున్న సీతమ్మ వాకిట్లో..

ఇప్పటికీ ఎన్నారైలను ఆకర్షిస్తున్న సీతమ్మ వాకిట్లో..

Published on Jan 22, 2013 6:16 PM IST

svsc-poster-new

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అమెరికా, మిగతా ఓవర్సీస్ ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడుతోంది. రెండవ వారంలో కూడా అక్కడ బాక్స్ ఆఫీసు వద్ద సాలిడ్ గా రన్ అవుతోంది. డల్లాస్ నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం వారాంతం కాకపోయినప్పటికీ 80% థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. అమెరికాలో తెలుగు సినిమాలకు ఇలా జరగడం చాలా అరుదైన విషయం.

విక్టరీ వెంకటేష్ క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒవర్సీస్ లో ఉన్న మార్కెట్ ఈ సక్సెస్ఫుల్ రన్ కి చెప్పుకోదగ్గ ప్రధాన కారణాలు. ఈ సినిమా ఇప్పటికే 1.5 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు. శ్రీ కాంత అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.

తాజా వార్తలు