ఆంద్ర ప్రదేశ్లో త్వరలోనే సినిమా టికెట్స్ ధరలు పెరగనున్నాయా? అంటే ప్రస్తుతం వస్తున్న వార్తలు అవుననే అంటున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు. సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో ధరలు ఎంత పెరగనున్నాయి అనే వివరాల లోనికెలితే ప్రతి కేటగిరీ పైన 10 నుంచి 20 రూపాయల వరకూ పెంచనున్నారు. 55 రూపాయల టికెట్ ని 75 రూపాయలకి, 35 రూపాయల టికెట్ ని 55 రూపాయలకి, 10 రూపాయల టికెట్ ని 20 రూపాయలకి పెంచనున్నారు. ఎ.సి లేని థియేటర్స్ టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా టికెట్స్ ధరలు పెంచాలని పోరాడుతున్న వారికి ఇది శుభవార్త, ఎవరైతే దీనికి వ్యతిరేకత వ్యక్తం చేసారో వారికి మాత్రం చెడువార్త. టికెట్స్ ధరలు పెరగడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన, జనరల్ ఆడియన్స్ పై ప్రభావం ఎలా ఉంటుందా అనేదాని కోసం వేచి చూడాలి.