ఇద్దరు హీరోల ఫాన్స్ ఫుల్ హ్యాపీ

ఇద్దరు హీరోల ఫాన్స్ ఫుల్ హ్యాపీ

Published on Jan 12, 2013 4:45 PM IST

SVSC
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ రోజు జరగగా చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా విడుదలైన తరువాత టాక్ ఎలా ఉంటుందన్న భయం కాకుండా ఇద్దరు స్టార్ హీరోల ఫాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం ఎక్కువుంది. సినిమా చుసిన తరువాత ఇద్దరు హీరోల ఫాన్స్ ఫోన్ చేసి సినిమాలో మా హీరోని కాకుండా కేవలం ఆ పెద్దోడు, చిన్నోడినే చూసుకున్నాం. ఇద్దరూ స్టార్ హీరోలం అనేది పక్కనపెట్టి చేసారు అని వారు చెప్పిన తరువాత నాకు ధైర్యం వచ్చింది.

ఇక టాక్ విషయానికి వస్తే చాలా ఏరియాల నుండి డిఫరెంట్ టాక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ బావుందని, సెకండ్ హాఫ్ కొంత డల్ అయిందని, క్లైమాక్స్ బావుందని అంటున్నారు. మా బ్యానర్లో వచ్చిన పరుగు, కొత్త బంగారు లోకం సినిమాలకు కూడా ఇలాగే డివైడ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ ద్వారా ఫామిలీ ఆడియెన్స్ దగ్గరవుతుంది. మార్నింగ్ షో టాక్ ఎలా ఉన్న ఈవినింగ్ టాక్ మారిపోతుంది. అది తెలుసుకోవడానికి నిన్న సుదర్శన్ ధియేటర్లో సెకండ్ షోకి వెళ్ళాను అక్కడ అందరూ లేడీస్ వచ్చి సినిమా చాలా బావుందని చెప్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారు రాత్రి ఒక మెసేజ్ చేసారు. సినిమా చాలా బావుందని, ధియేటర్లో మల్లి చూడటానికి టైం కుదరదు కాబట్టి డీవీడీ రిలీజ్ అయ్యాక పంపించు అని చెప్పారు. ఈ రెస్పాన్స్ అంతా చూస్తుంటే ఆనందంగా ఉంది అన్నాడు.

తాజా వార్తలు