“టక్ జగదీష్”లో రీతూకి స్ట్రాంగ్ రోల్ లానే ఉంది!

“టక్ జగదీష్”లో రీతూకి స్ట్రాంగ్ రోల్ లానే ఉంది!

Published on Mar 10, 2021 11:57 AM IST

ఇప్పుడు నాచురల్ స్టార్ నాని లైనప్ సాలిడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. తన బెంచ్ మార్క్ ఫిల్మ్ 25వ చిత్రం “వి” అంతగా ఆకట్టుకోకపోయినా పైగా అది స్ట్రీమింగ్ రిలీజ్ అయినా కూడా తన నెక్స్ట్ సినిమాలపై మంచి హైప్ ను సెట్ చేసుకున్నాడు. మరి అలా ఇప్పుడు నాని చేస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “టక్ జగదీష్”. తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే ఇప్పటికే నాని రోల్ ను రివీల్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్స్ లో ఒకరైన టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ పోస్టర్ ను రివీల్ చేసారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ను చూస్తే కాస్త ఆసక్తికరంగాను పైగా ఇందులో ఆమెకు మంచి స్కోప్ ఉన్న పాత్రనే సెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆమె చేతిలో కంకణం నల్లని దుస్తులు నాని ఎదురుగా నించొని షాక్ అయ్యి చూస్తుంది.

పైగా అప్పుడే తనకి బొట్టు పెట్టినట్టుగా కనిపిస్తుంది. మరి ఇదేదో ఒక షాకింగ్ సంఘటన లేదా ట్విస్ట్ తర్వాత రివీల్ అయ్యేట్టుగా అనిపిస్తుంది. అలాగే బహుశా ఈమెది నెగిటివ్ రోల్ కూడా కావొచ్చేమో అని అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం టక్ జగదీష్ లో రీతూ కి ఒక చక్కటి రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు