కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు నిజ జీవితం లో కూడా కోనా వెంకట్ కు హీరో గా మారారు. ఆయన విల్లన్లు ఎవరినీ కొట్టలేదు సుమండీ!! ప్రస్తుతం న్యూ యార్క్ లో ఉన్న మోహన్ బాబు , కథా చర్చలకు వెళ్ళిన కోనా వెంకట్ మరియు బి.వి.ఎస్. రవి ల మధ్య ఒక గమ్మత్తైన సన్నివేసం చోటుచేసుకుంది.
న్యూ యార్క్ లో మోహన్ బాబు ఉండే రూం పక్కనే మరొక రూం తీసుకున్నారు కోనా వెంకట్ మరియు బి.వి.ఎస్. రవి లు. అయితే కాలకృత్యాల అనంతరం, అమెరికాలో టిష్యు పేపర్ ను వాడతారు. ఇది అలవాటు లేని వెంకట్ మరియు రవి లు, రూం లో ఉన్న కాఫీ కప్పులనే చెంబులు గా వాడుకున్నారట. ఇది తెలిసిన హోటల్ యాజమాన్యానికి చిర్రెత్తుకొచ్చింది. విషయం తెలుసుకున్న మోహన్ బాబు యాజమాన్యానికి నచ్చ జెప్పి , 500 డాలర్ల ఫైను కూడా కట్టి వెంకట్ మరియు రవి లను కాపాడారట.
ఈ విషయాన్నీ స్వయం గా మోహన్ బాబే ఆయన సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో తెలిపారు.