సీతమ్మ వాకిట్లో.. సెన్సార్ తేదీ ఖరారు

సీతమ్మ వాకిట్లో.. సెన్సార్ తేదీ ఖరారు

Published on Jan 8, 2013 3:50 AM IST

SVSC-New-Posters-(2)
విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జనవరి 8న జరుపుకోనుంది. రేపటి మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ వస్తుందని ఆశించవచ్చు. జనవరి 11న రిలీజ్ కు సిద్దమవుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరి 10న ఈ సినిమా ప్రీమియర్ షోస్ వెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. సమంత – అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ – మహేష్ బాబు లకి తల్లి తండ్రులుగా ప్రకాష్ రాజ్ – జయసుధ కనిపించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

తాజా వార్తలు